Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 90

1ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం. 1

2పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి. 1

3నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు. 1

4నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి. 1

5వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు. 1

6ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది. 1

7నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది. 1

8మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. 1

9నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది. 1

10మా బలము + 90:10 బలము అహంకారం డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం. 1

11నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు? 1

12కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు. 1

13యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు. 1

14ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం. 1

15నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు. 1

16నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు. 1

17మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.

← Psalms 89Read In The App, Free →Psalms 91 →

Study Psalms 90

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150