Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 76

1యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది. 1

2షాలేంలో + 76:2 షాలేంలో యెరూషలేము ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది. 1

3అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. సెలా. 1

4నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు. 1

5గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు. 1

6యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు. 1

7నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు? 1

8నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది. 1

9దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా. 1

10కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు. 1

11మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి. 1

12అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.

← Psalms 75Read In The App, Free →Psalms 77 →

Study Psalms 76

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150