Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 141

1యెహోవా, నేను నీ కోసం ఆక్రోశిస్తున్నాను. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకో. నేను మొరపెడుతున్నాను, నేను చెప్పేది ఆలకించు. 1

2నా ప్రార్థన నీకు ధూపం లాగా నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం లాగా ఉండు గాక. 1

3యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి. 1

4నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక. 1

5నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి. 1

6దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు. 1

7వారు అంటారు, ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 1

8యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు. 1

9నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు. 1

10నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.

← Psalms 140Read In The App, Free →Psalms 142 →

Study Psalms 141

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150