Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 29

1బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి! 1

2యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి. 1

3యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు. 1

4యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. 1

5యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు. 1

6ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు. 1

7యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది. 1

8యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు. 1

9యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు. 1

10యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు. 1

11యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.

← Psalms 28Read In The App, Free →Psalms 30 →

Study Psalms 29

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150