Psalms · బైబిల్ (తెలుగు)

Psalms 7

1యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు. 1

2లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు. 1

3యెహోవా నా దేవా, నేను చేశానని నా శత్రువులు చెప్పిన పనులేవీ నేను చెయ్యలేదు. నా చేతుల్లో అన్యాయమేమీ లేదు. 1

4నాతో శాంతిసమాధానాలతో ఉన్నవాళ్ళ పట్ల నేను ఏ తప్పూ చెయ్యలేదు. విచక్షణ లేకుండా నా విరోధులకు నేను ఏ హానీ చెయ్యలేదు. 1

5నేను చెప్పేది సత్యం కాకపోతే నా శత్రువు నన్ను తరిమి పట్టుకుంటాడు గాక. బ్రతికి ఉన్న నా శరీరాన్ని తొక్కి, నేలరాసి దుమ్ములో అవమానకరమైన స్థితిలో నన్ను పడవేస్తాడు గాక. సెలా. 1

6యెహోవా, కోపంతో లేచి రా, నా శత్రువుల ఆగ్రహానికి విరోధంగా నిలబడు. నా నిమిత్తం లేచి వచ్చి వాళ్ళ కోసం నువ్వు ఆజ్ఞాపించిన న్యాయ విధులను జరిగించు. 1

7నీ చుట్టూ జాతులు సమాజంగా కూడి ఉన్నాయి. మరొకసారి నువ్వు వాళ్ళ మీద నీ న్యాయమైన స్థానాన్ని చేపట్టు. 1

8యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి. 1

9దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు. 1

10హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది. 1

11దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు. 1

12ఒకడు తన మనస్సు తిప్పుకోకపోతే, దేవుడు తన ఖడ్గానికి పదును పెట్టి, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. 1

13అతని మీద ఉపయోగించడానికి ఆయుధాలు సిద్ధం చేస్తాడు. తన బాణాలను అగ్ని బాణాలుగా చేస్తాడు. 1

14దుష్టత్వాన్ని గర్భం ధరించినవాడి సంగతి ఆలోచించండి. అతడు నాశనకరమైన ప్రణాళికలు రచిస్తూ, హానికరమైన అబద్ధాలకు జన్మనిస్తాడు. 1

15వాడు గుంట తవ్వి, దాన్ని లోతు చేసి, తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. 1

16అతడు రచించిన నాశనకరమైన ప్రణాళికలు అతని తల మీదకే వస్తాయి. అతడు ఆలోచించిన హింస అతని తల మీదకే వచ్చిపడుతుంది. 1

17యెహోవా న్యాయాన్నిబట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. సర్వోన్నతుడైన యెహోవాకు స్తుతి కీర్తన పాడతాను.

← Psalms 6Read In The App, Free →Psalms 8 →

Study Psalms 7

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschCharles SpurgeonScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150